తాండూరు, జూన్ 20 : విద్యాభివృద్ధికి ప్రత్యేక కృషి చేయడంతో పాటు ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. గురువారం తాండూరు క్యాంపు కార్యాలయంలో యాలాల మండలానికి చెందిన 80 మంది లబ్ధిదారులకు రూ.80,09,280 విలువగల కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేయడంతో పాటు తాండూరు పట్టణంలో రూ.2 కోట్ల వ్యయంతో నిర్మించిన ప్రభుత్వ జూనియర్ కళాశాల అదనపు తరగతి గదులు, ప్రహరీ, మరుగుదొడ్డు, 7వ వార్డులో గల ఎన్టీఆర్ కాలనీలో రూ.25 లక్షల వ్యయంతో నిర్మించిన అంగన్వాడీ, డ్వాక్రా భవనా లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలవడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు.
ప్రతి పేదింటి ఆడపిల్ల మెడలో బంగారం ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం త్వరలో తులం బంగారం ఇస్తుందన్నారు. ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ పంక్షేమ పథకాలు అందించడానికి కృషి చేస్తున్నామన్నారు. తాను ఎల్లప్పుడూ ప్రజా క్షేత్రంలోనే ఉంటానన్నారు. ప్రజలకు ఎలాంటి సమస్యలు వాటిల్లినా వాటిని తన దృష్టికి తీసుకురావాలన్నారు. అభివృద్ది, సంక్షేమం దిశగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు. పార్టీలకతీతంగా నియోజకవర్గ అభివృద్దిలో తనతో ప్రతి ఒక్క రూ కలసి రావాలన్నారు. ప్రజల ఆస్తులకు, వారి గౌరవ మర్యాదలకు ఎవరు విఘాతం కలిగించిన ఉపేక్షించేది లేదన్నారు. ప్రజలు తమ ఆస్తులకు ఇతరులు అడ్డంకులు కలిపిస్తున్నారని భావిస్తే తనను నేరుగా సంప్రదించాలన్నారు. ఎంతటి వారైనా వారిపై చట్ట ప్రకారం చర్యలను తీసుకుంటామన్నారు.
పెద్దేముల్: మండల పరిధిలోని గొట్లపల్లి తెలంగాణ మోడల్ స్కూల్లో రూ.18 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న సైన్స్ ల్యాబ్‌కు, మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో రూ.27 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న అదనపు తరగతి గదుల నిర్మాణానికి, మారేపల్లి గ్రామ సమీపంలోని కేజీబీవీలో రూ.2 కోట్ల 30 లక్షలతో కాలేజీభవన సముదాయం, టాయిలెట్స్, సైన్స్ ల్యాబ్‌లకు గురువారం ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల చదువుల పట్ల ఉపాధ్యాయులు శ్రద్ధ వహించి వారిని పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతాన్ని పెంచాలని సూచించారు.
కేజీబీవీ పాఠశాలలో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోట్బుక్లు, యూనిఫామ్‌లను పంపిణీ చేసి కిచెన్ రూమ్‌ను పరి శీలించి సిబ్బందితో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకొన్నారు. సిబ్బంది పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా దశలవారీగా పరిష్కరిస్తామన్నారు. పెద్దేముల్ బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకొన్నారు. అనంతరం ఆయా పాఠశాలల్లో ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు.
కార్య క్రమంలో జడ్పీటీసీ ధారాసింగ్, పార్టీ నాయకులు పి.నారాయణ రెడ్డి, పి. మహిపాల్ రెడ్డి, జితేందర్ రెడ్డి, కె.గోపాల్‌రెడ్డి, కె.గోపాలకృష్ణ, ఎన్. ఎల్లారెడ్డి,ప్రవీణ్ కుమార్,రవిశంకర్, మురళీగౌడ్, డీవై చిన్న నర్సింహులు, లొంక నర్సింహులు, బాల్ రెడ్డి,లాల్‌రెడ్డి, మల్లేశం, డీవై నర్సింహులు, గోపాల్, విద్యాసాగర్, కోట్‌పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ అంజయ్య,వైస్ చైర్మన్ ఎస్,నారాయణ రెడ్డి,డైరెక్టర్లు హరిసూదన్రెడ్డి, ఎక్బాల్, రాంశెట్టి, రాష్ట్ర మైనారిటీ కన్వీనర్ ఎండీ. రియాజ్, శ్రీనివాస్ రెడ్డి, వెంకటేశ్, వీరారెడ్డి, ఆనందం, సాయిబాబా, రాములు, మల్లేశం, మల్లప్ప, బాబుసింగ్, ప్రిన్సిపాల్ గాయత్రి,ఎస్వో రాజేశ్వరీ, హైస్కూల్ హెచ్ఎంలు సునీత, అక్కమాదేవి, ద్యావరి నరేందర్ రెడ్డి, రాధాకృష్ణ, పాఠశాలల ఉపాధ్యాయులు, సిబ్బంది, నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.