చేవెళ్ల రూరల్/చేవెళ్ల టౌన్, అక్టోబర్ 8 : అన్ని వర్గాల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం చేవెళ్ల మండల పరిధిలోని మలాపూర్ గ్రామంలో పలు అభివృద్ధి పనులు బీటీ, సీసీ రోడ్డు, అండర్‌గ్రౌండ్ డైనేజీ, వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనం తదితర అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, చేవెళ్లలో మినీ స్పోర్ట్స్ స్టేడియం, ఎంపీడీవో నూతన కార్యాలయ భవనం ప్రారంభానికి మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ఎమ్మెల్యే యాదయ్య, సర్పంచ్‌లు శివారెడ్డి, శైలజలతో కలిసి ప్రారంభించారు. అనంతరం చేవెళ్లలోని షాబాద్ చౌరస్తాలో ఎమ్మెల్యే యాదయ్య ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.
కార్యక్రమంలో ఎంపీపీ విజయలక్ష్మి, జడ్పీటీసీ మాలతి, వైస్ ఎంపీపీ శివప్రసాద్, మారెట్ కమిటీ చైర్మన్ వెంకటరంగారెడ్డి, వైస్ చైర్మన్ నర్సింహులు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ప్రభాకర్, మండల యూత్ అధ్యక్షుడు శేఖర్, సర్పంచ్ల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, బీఆర్ఎస్ మండల బీసీ సెల్ అధ్యక్షుడు రాములు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీపీ బాల్‌రాజ్, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శులు, కౌకుంట్ల రైతు బంధు సమితి అధ్యక్షుడు నాగార్జునరెడ్డి, పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీవో హిమబిందు, ఎంపీవో విఠలేశ్వర్‌జీ, సూపరింటెండెంట్ రాజ్‌కుమార్, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు అబ్దుల్ ఘని, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ మాణిక్యరెడ్డి, గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ యాదగిరి, బీఆర్ఎస్ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
మొయినాబాద్ : ఎన్నికలు సమీపిస్తున్నాయి.. ఓట్ల కోసం మీ ఇండ్ల ముందుకు అందరూ వస్తారు.. కాంగ్రెస్, బీజేపోళ్ల మాటలు నమ్మి మోసపోతే మళ్లీ గోసపడుతామని.. ఎన్నికల ముందు ఎవరు కూడా ఆగమాగం కావద్దని రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. మండల పరిధి సురంగల్‌లో రూ.25 లక్షలతో వేసిన సీసీ రోడ్డును సర్పంచ్ లావణ్యతో, కేతిరెడ్డిపల్లి గ్రామంలో రూ.1.35 కోట్లతో చేపట్టిన సీసీ రోడ్లు, అంతర్గత మురుగు కాలువల నిర్మాణ పనులను సర్పంచ్ దారెడ్డి శోభ, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే యాదయ్య, ఎంపీపీ నక్షత్రం, జడ్పీటీసీ శ్రీకాంత్‌లతో కలిసి మంత్రి మహేందర్‌రెడ్డి ఆదివారం ప్రారంభించారు.
సురంగల్, కేతిరెడ్డిపల్లిలో జరిగిన సభల్లో మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం వివిధ అభివృద్ధి, ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేయడంలో దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని చెప్పారు. హైదరాబాద్ అభివృద్ధి ఆకాశమే హద్దుగా నిలువడంతో దేశం తెలంగాణ వైపు చూస్తున్నదని పేర్కొన్నారు. పేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసిందని చెప్పారు. గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సన్న బియ్యంతో భోజనం, సంపూర్ణ ఆరోగ్యం కోసం కేసీఆర్ అల్పాహారాన్ని కూడా పెడుతున్నదని పేర్కొన్నారు. విద్య కోసం రాష్ట్ర ప్రభుత్వం కోట్ల నిధులు ఖర్చు చేస్తున్నదని తెలిపారు.
చేవెళ్ల నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే యాదయ్య అభివృద్ధి చేశారని పేర్కొన్నారు. చేవెళ్ల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేతో పాటు ఎంపీ రంజిత్‌రెడ్డి కూడా అభివృద్ధి కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారని తెలిపారు. అరవై ఏండ్లలో చేయని అభివృద్ధి ఇప్పుడు చేస్తామని.. కాంగ్రెస్‌ను గెలిపించాలని వస్తున్నారని.. కాంగ్రెస్ వాళ్ల మాటలు నమ్మొద్దని సూచించారు. ఎన్నికలకు ముందే కాంగ్రెస్, బీజేపోళ్లు గ్రామాల్లో తిరుగుతూ తమ ఉనికి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఎవరెన్ని మాయమాటలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. చేవెళ్ల ఎమ్మెల్యేగా యాదయ్యను, ఎంపీగా రంజిత్‌రెడ్డిని మరోసారి దీవించి.. ఆశీర్వదించి గెలిపిస్తే మరింత అభివృద్ధి చేయడానికి కృషి చేస్తారని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీటీసీ పద్మమ్మ, మాజీ జడ్పీటీసీ అనంతరెడ్డి, సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు నరోత్తంరెడ్డి, ఎల్కగూడ సర్పంచ్ కుమార్, ఏఎంసీ వైస్ చైర్మన్ ఎంఏ రవూఫ్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ జగన్మోహన్రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ వెంకట్‌రెడ్డి, సీనియర్ నాయకులు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి నర్సింహగౌడ్, ఎంపీటీసీ అర్చన, ఉపసర్పంచ్లు, వార్డు సభ్యులు, మాజీ సర్పంచ్‌లు, మాజీ ఉపసర్పంచ్లు అంజిరెడ్డి, జైపాల్‌రెడ్డి, ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజు, యాదవ మహా సభ జిల్లా ఉపాధ్యక్షుడు యాదగిరియాదవ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ అధ్యక్షుడు నర్సింగ్‌రావు, పీఆర్ డీఈ విజయ్‌కుమార్, ఏఈ రమ్య, కార్యదర్శి సుహాసిని పాల్గొన్నారు.
అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న టీఆర్ఎస్ సరారును మరోసారి గెలిపించాలని ఎంపీ రంజిత్‌రెడ్డి అన్నారు. ప్రజలు అభివృద్ధి వైపు, సంక్షేమ ప్రభుత్వానికి అండగా నిలువాలన్నారు. సీఎం కేసీఆర్ పాలనలోనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నారు. ప్రజల ఆశీర్వాదంతో భారీ మెజార్టీతో మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రానున్నదని ఎంపీ స్పష్టం చేశారు.
ఛత్రపతి శివాజీ యుద్ధ విద్యలో అపారమైన జ్ఞానాన్ని సంపాదించుకొని శత్రువులను తమ నైపుణ్యంతో ఎదిరించిన ధైర్యశాలి అని రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. సురంగల్‌లో సర్పంచ్ లావణ్య, మాజీ ఉపసర్పంచ్ అంజిరెడ్డి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఆదివారం చేవెళ్ల ఎంపీపీ డాక్టర్ గడ్డం రంజిత్‌రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఎంపీపీ గునుగుర్తి నక్షత్రం, జడ్పీటీసీ కాలె శ్రీకాంత్‌లతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ.. శివాజీ తన తండ్రి నుంచి యుద్ధ విద్యలను నేర్చుకొని నైపుణ్యాన్ని ప్రదర్శించిన మహానుభావుడని పేర్కొన్నారు. గోవులను యథేచ్ఛగా వధిస్తున్న రోజుల్లో శివాజీ గోవులను రక్షించారని తెలిపారు. మహిళలపై అఘాయిత్యాలు జరుగకుండా అండగా నిలిచి వారిని గౌరవించి పసుపు, కుంకుమలు ఇచ్చి ప్రాధాన్యత ఇచ్చారని చెప్పారు. శివాజీ అన్ని మతాలను గౌరవించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. నేటి యువత చరిత్రకారుల విధానాలను అవలంబించాలని సూచించారు. యువత భుజస్కందాలపై దేశ భవిష్యత్తు ఉందని పేర్కొన్నారు. అనంతరం సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. అభివృద్ధి విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎకడా వెనకడుగు వేయకుండా ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ధ్యేయంగా పని చేస్తున్నదని పేరొన్నారు. తెలంగాణ పథకాలను దేశంలోని కాంగ్రెస్, బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కాపీకొడుతున్నారన్నారు. దేశం తెలంగాణ వైపు చూస్తుంటే.. ప్రతిపక్షాలు తమ అసత్య ప్రచారాలతో ప్రజలను వంచన చేస్తున్నాయని మంత్రి మహేందర్‌రెడ్డి మండిపడ్డారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రంలో వేల కోట్లతో అభివృద్ధి సాగుతున్నదన్నారు. 24 గంటల కరెంటు, రైతు బంధు, రైతు బీమా లాంటి పథకాలు ఏ రాష్ట్రంలోనూ అమలు కావడంలేదన్నారు. ఎవరు ఎంత ప్రయత్నించినా ప్రజలు సీఎం కేసీఆర్‌ను మరోమారు దీవిస్తారని, ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి అవుతారన్నారు.
చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎప్పుడూ లేనివిధంగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నదన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు అందుతాయని, ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. అర్హత కలిగి ఉండి పథకాలు రాకపోతే దరఖాస్తు చేసుకునే విధానం తప్పుగా ఉండవచ్చని.. దరఖాస్తులు సరిగ్గా చేసుకుని పథకాల లబ్ధి పొందాలని ఎంపీ సూచించారు.
చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య మాట్లాడుతూ.. చేవెళ్ల నియోజకవర్గం రాష్ట్ర మంత్రులు కేటీఆర్, సబితారెడ్డి, మహేందర్‌రెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి సహాయ సహకారాలతో సర్వతోముఖాభివృద్ధి చెందుతున్నదని తెలిపారు. షాబాద్ మండలంలో అనేక కంపెనీలు రావడంతో స్థానికులకు ఉపాధి అవకాశాలు మెండుగా లభించే అవకాశం ఉందన్నారు. గృహలక్ష్మి పథకం ద్వారా అర్హత కలిగిన వారికి ఇండ్లు అందుతాయని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.