వికారాబాద్, డిసెంబర్ 3 : గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను సర్పంచ్‌లుగా గెలిపించుకోవాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు. బుధవారం వికారాబాద్ మండలం పులుమద్ది, మోమిన్‌పేట మండలం లచ్చానాయక్తండాకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆ పార్టీని వదిలి మెతుకు ఆనంద్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
పులుమద్ది గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు నర్సింహారెడ్డి, అనంత్‌రెడ్డి, బేగరి అశోక్, కుమ్మరి దశరథ్ వారి అనుచరులతో, లచ్చానాయక్తండాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు సంతోష్, చవాన్ రాజు, వెంకటేశ్ వారివారి అనుచరులతో కలిసి బీఆర్ఎస్లో చేరారు. పార్టీలో చేరినవారికి ఆనంద్ గులాబీ కండువాలతో స్వాగతించారు.
కార్యక్రమంలో మైనార్టీ విభాగం మండల అధ్యక్షుడు గయాజ్, నాయకుడు భాస్కర్, మాజీ ఎంపీటీసీ మహిపాల్‌రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు వెంకటేశంగౌడ్, పట్టణ సీనియర్ నాయకుడు శ్రీనివాస్‌రెడ్డి, మాజీ సర్పంచ్ లలితా చరణ్‌సింగ్, సీనియర్ నాయకుడు చందర్, మాజీ ఉప సర్పంచ్ గణపతి తదితరులు పాల్గొన్నారు.
పెద్దేముల్ : మండలంలోని ఓమ్లానాయక్తండాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ ఎంపీటీసీ గెమ్యానాయక్ బుధవారం తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. రోహిత్‌రెడ్డి ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతోపాటు తండాకు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు కూడా చేరారు.