Quarry Pond | జగద్గిరిగుట్ట ఏప్రిల్ 23 : ఓ విద్యార్థి ఈతకని వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందిన ఘటన జగద్గిరిగుట్ట పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల వివరాల మేరకు.. బౌరంపేట ఇందిరమ్మ కాలనీకి చెందిన వెంకట్రావు కుమారుడు మణి సుందర్ కుమార్ (20) కూకట్పల్లిలోని ఐ క్రియేట్ కాలేజీలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు.
మణి సుందర్ కుమార్ ఇవాళ మధ్యాహ్నం మరో ఇద్దరు మిత్రులతో కలిసి గాజులరామారం వచ్చాడు. అక్కడి సమీపంలోని క్వారీ నీటి గుంతల్లో ఈతకు దిగారు. మణి సుందర్ నీట మునిగిపోవడంతో మిగతా మిత్రులు స్థానికులకు విషయం చెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు రెస్యూ సిబ్బంది సాయంతో గాలింపు చేపట్టారు. నీటిలో చిక్కుకున్న మృతదేహం సాయంత్రం లభ్యమైంది.
మృతదేహాన్ని గాంధీకి తరలించి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వేసవి నేపథ్యంలో ప్రతీ ఏడాది ఇక్కడి క్వారీ నీటి గుంతల్లో ఇదే తరహా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రెవెన్యూ, పోలీసులు నియంత్రణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
Errabelli Dayakar Rao | ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో బీఆర్ఎస్లో భారీగా చేరికలు
KTR | పెంబర్తి వద్ద కేటీఆర్కు ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి