మల్కాజిగిరి, మే 30: హైదరాబాద్ పరిధిలోని మల్కాజిగిరిలో దారుణం జరిగింది. ఏడేళ్ల బాలిక ఇంట్లో ఒంటరిగా ఉండటం గమనించి ఓ యువకుడు ఆమెపై అఘాయిత్యానికి యత్నించాడు. అయితే బాలిక కేకలు వేయడంతో అక్కడి నుంచి పరాయ్యాడు. మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
ఇన్స్పెక్టర్ సత్యనారాయణ కథనం ప్రకారం.. ఓల్డ్ మల్కాజిగిరిలో ఓ మైనర్ బాలిక (7) తల్లిదండ్రులతో నివసిస్తోంది. ఆమెపై అదే ప్రాంతానికి చెందిన అశోక్ (19) కన్నేశాడు. ఈ క్రమంలో బాలిక ఒంటరిగా ఉన్నది గమనించిన అశోక్.. ఇంట్లోకి వెళ్లి ఆమెపై లైంగిక దాడికి గమనించాడు. బాలిక గట్టిగా అరవడంతో భయపడి అశోక్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ విషయాన్ని బాలిక తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో బాలిక తల్లిదండ్రులను పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువకుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.