Rohit Sharma : పంతొమ్మిదో సీజన్ ఐపీఎల్ కోసం రోహిత్ శర్మ (Rohit Sharma ) సిద్ధమవుతున్నాడు. రెండు రోజుల క్రితం కుటుంబంతో కలిసి మాల్దీవ్స్(Maldives)లో వెకేషన్లో సరదాగా గడిపిన రోహిత్.. స్వదేశం వస్తూనే నేరుగా ముంబై స్క్వాడ్‌తో కలిశాడు. మంగళవారం సహచరులు, కోచ్ మహేల జయవర్ధనేతో కాసేపు ముచ్చటించిన హిట్‌మ్యాన్.. కిట్ బ్యాగ్‌తో మైదానంలోకి దిగాడు. నెట్స్‌లో బ్యాటింగ్, ఫీల్డింగ్.. ప్రాక్టీస్ చేసిన రోహిత్ ఐపీఎల్లో రఫ్ఫాడించాలనే కసితో ఉన్నాడు.
ఐపీఎల్ దిగ్గజ కెప్టెన్లలో ఒకడైన రోహిత్ శర్మ మరో సీజన్‌కు రెఢీ అవుతున్నాడు. గత సీజన్లో దంచేసిన హిట్‌మ్యాన్ (15 మ్యాచుల్లో 418 పరుగులు) ఈసారీ శుభారంభాలు ఇవ్వాలనే కసితో ఉన్నాడు. మంగళవారం ముంబై స్క్వాడ్‌తో కలిసిన రోహిత్ వెంటనే బ్యాటింగ్ ప్రాక్టీస్ మొదలెట్టాడు. శార్దూల్ ఠాకూర్, ఇతర ముంబై బౌలర్లను కాచుకున్న అతడు.. డిఫెన్స్, భారీ షాట్లు సాధన చేశాడు. అనంతరం సహచరులతో కలిసి ఫీల్డింగ్ చేశాడు.
Shaana and Lord’s banter is already here 😂 pic.twitter.com/8SZHCH0hit
— Mumbai Indians (@mipaltan) March 17, 2026
మొన్నటి వరకూ టీ20 ప్రపంచకకప్ అంబాసిడర్‌గా మైదానాల్లో సందడి చేసిన రోహిత్.. కాస్త బ్రేక్‌లో మాల్దీవ్స్‌లో కుటుంబంతో కలిసి సేదతీరాడు. ఐపీఎల్‌కు కౌంట్‌డౌన్ తన కెప్టెన్సీలో ముంబైని ఐదుసార్లు (2013, 2015, 2017, 2019, 2020) ముంబైని ఛాపియన్‌గా నిలిపిన రోహిత్.. గత రెండేళ్లుగా హార్దిక్ పాండ్యా సారథ్యంలో ఆడుతున్నాడు.
Beautiful moments of love. ❤️
Rohit Sharma and Ritika Sajdeh — a couple that always radiates warmth, simplicity, and pure chemistry. ✨#RohitSharma #RitikaSajdeh pic.twitter.com/m6yg6mybbK
— ND Sport (@SportsByND) March 15, 2026
Holiday vibes! 🌴
Rohit Sharma enjoying his vacation in the Maldives.😍#RohitSharma #Maldives #Cricket pic.twitter.com/ckjbOdZqOf
— OneCricket (@OneCricketApp) March 15, 2026
పంతొమ్మిదో సీజన్‌కు మరో పది రోజులే ఉండడంతో ఈ దిగ్గజ ఆటగాడు ప్రాక్టీస్ మొదలెట్టాడు. ఐపీఎల్ ఆరంభంలో దక్కన్ ఛార్జర్స్ తరఫున విజేతగా నిలిచిన రోహిత్.. ఆపై ముంబై ఇండియన్స్ గూటికి చేరాడు. అక్కడ రికీ పాంటింగ్ వారసుడిగా 2013లో సారథ్యం స్వీకరించిన ముంబైకర్ విజయవంతమైన నాయకుడిగా చరిత్రకెక్కాడు.