Widows | జవహర్‌నగర్, జూన్ 23 : వితంతు మూఢాచారాన్ని అరికడదాం.. సమాజంలో సమాన గౌరవిద్దామని మాజీ కార్పొరేటర్ కారింగుల నిహారికగౌడ్ అన్నారు. జవహర్‌నగర్ కార్పొరేషన్ వికలాంగుల కాలనీలో అంతర్జాతీయ వితంతువుల దినోత్సవాన్ని పురస్కరించుకొని బాల వికాస స్వచ్ఛంధ సంస్థ హైదరాబాద్ డివిజన్ డైరెక్టర్ బూడిద వెంకటేష్ ఆధ్వర్యంలో సోమవారం కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా శంకర్‌గౌడ్ మాట్లాడుతూ.. ప్రపంచం ఎంతో పురోగతి సాధించిన కాలంలోనూ ముఖ్యంగా శుభకార్యాల్లో వితంతువులను దూరం పెడుతున్నారని, వారికి అందరు మహిళల్లాగే గౌరవం కల్పించాలని అన్నారు. సమాజంలో వితంతువుల పట్ల చూపుతున్న వివక్ష, చిన్నచూపును తొలగించేందుకు బాల వికాస సంస్థ కృషి అభినందనీయమని పేర్కొన్నారు. భర్త చనిపోయిన మహిళలు గాజులు, పూలు, బొట్టు తీసేయాల్సిన అవసరం లేదని తెలిపారు.
వితంతువుల పిల్లల చదువుకు ఆర్ధికసాయం అందించడంతోపాటు ప్రభుత్వం అందించే పథకాలు ప్రతి ఒక్కరికి అందేలా కృషి చేయాలన్నారు. అనంతరం కాలనీవాసులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శంకర్‌గౌడ్, బాలవికాస హైదరాబాద్ కో ఆర్డినేటర్ వినోద్‌రెడ్డి, బాషపల్లి రమేష్‌చారి, రూతు, రాణి, మంజుల, రవి, భాస్కర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Alumni | ఎన్నాళ్లకెన్నాళ్లకు.. పాతికేళ్ల తర్వాత పూర్వ విద్యార్థులంతా కలిశారు
Rayaparthi | వ్యవసాయ భూములకు వెళ్లే బాట కబ్జా.. కలెక్టరేట్ ఎదుట రైతుల నిరసన
Suryapet | కేసుల పరిష్కారంలో న్యాయవాదుల సహకారం అవసరం : జూనియర్ సివిల్ జడ్జి ఆయేషా సరీన