Corporator Mekala Sunitha | నేరేడ్మెట్, మార్చి 17: మల్కాజిగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు గౌతంనగర్ డివిజన్ పరిధిలోని అన్ని కాలనీల్లో వేసవికాలంలో నీటి సమస్య నివారణకు చర్యలు తీసుకుంటున్నామని కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్ పేర్కొన్నారు. ఇవాళ గౌతంనగర్ డివిజన్ పరిధిలోని ఇందిరా నెహ్రూ నగర్, ఈస్ట్ ఇందిరా నెహ్రూనగర్ తదితర ప్రాంతాలలో స్థానికులతో కలిసి పర్యటించారు.
ఈ సందర్భంగా గత కొంతకాలంగా పవర్బోరుకు సంబంధించిన నీటి సరఫరా ఇబ్బందిగా ఉందని ఆయ కాలనీవాసులు కార్పొరేటర్ దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే స్పంధించిన కార్పొరేటర్ 10 నీటి వాల్స్ వరమ్మతులకు సొంత నిధులు ఇచ్చి మరమ్మతులు చేయిస్తామని స్థానికులకు హామి ఇచ్చారు. ఈకార్యక్రమంలో నాయుకులు మేకల రాము యాదవ్, పిట్ల నందు, సిద్ది రాములు, బైరు అనిల్ తదితరులు పాల్గొన్నారు.
Read Also :
HYDRAA | బండ్లగూడలో హైడ్రా కూల్చివేతలు
ASP Chittaranjan | విద్యార్థులు ఒత్తిడిని అధిగమిస్తేనే విజయం తథ్యం : ఏఎస్పీ చిత్తరంజన్
Harish Rao | కాంగ్రెస్ ముసుగులో ఉన్న బీజేపీ మనిషి రేవంత్: హరీశ్‌రావు