MLA Bandari Lakshma Reddy | చర్లపల్లి, జూన్ 17 : ఉప్పల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. చర్లపల్లి డివిజన్లో చేపట్టిన పర్యటనలో గుర్తించిన సమస్యలను జీహెచ్ఎంసీ తూర్పు జోనల్ కమిషనర్, ఐఏఎస్ హేమంత్ కేశవ్ పాటిల్ దృష్టికి తీసుకువచ్చి సమస్యల పరిష్కారానికి నిధులు కేటాయించాలని కోరుతూ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆయనకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. వచ్చే వర్షాకాలంలో నియోజకవర్గంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిధులు కేటాయించి సమస్యలను పరిష్కారానికి చర్యలు తీసుకొవాలని జోనల్ కమిషనర్‌ను కోరడంతో ఆయన సానుకూలంగా స్పదించారని తెలిపారు. చర్లపల్లి డివిజన్లో చేపట్టిన పర్యటనలో గుర్తించిన సమస్యలను జోనల్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లామని, ఆయన సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామి ఇచ్చారన్నారు.
ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించేందుకు చర్యలు తీసుకుంటామని హామి ఇచ్చారని, వర్షాకాలంలో పారిశుద్ద్య సమస్యలు తలేత్తకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అదేవిధంగా చర్లపల్లి డివిజన్ సమగ్రాభివృద్ధికి తన వంతు కృషి చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నేమూరి మహేశ్‌గౌడ్, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
F-35 fighter jet | ఇంకా కేరళలోనే F-35 ఫైటర్ జెట్.. ఎందుకంటే..!
OTT | డైరెక్ట్‌గా ఓటీటీలోకి ఉప్పు కప్పురంబు.. స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడంటే..!
Robert Vadra | ఈడీ విచారణకు మరోసారి డుమ్మా కొట్టిన రాబర్ట్ వాద్రా