MLA KP Vivekananda | కుత్బుల్లాపూర్, మే 18 : పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు సత్వర చర్యలు తీసుకుంటామని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. ఇవాళ కొంపల్లి మున్సిపాలిటీ పరిధి జయదర్శిని ఎంక్లేవ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన మంచి నీటి సరఫరాను ఎమ్మెల్యేకేపీ వివేకానంద్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా, వెలుస్తున్న కాలనీలలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని, ఇందులో భాగంగా జయదర్శిని ఎంక్లేవ్ నందు నెలకొన్న నీటి ఎద్దడి సమస్యను పరిష్కరించామన్నారు. రానున్న రోజుల్లో కూడా కాలనీలో మిగిలిపోయి ఉన్న అన్నీ సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించి అభివృద్ధి పరుస్తామన్నారు.
ఎప్పుడూ రుణపడి ఉంటా..
2023 సంవత్సరంలో జరిగిన ఎన్నికల ప్రచారాన్ని తాను మొదలుపెట్టింది ఇక్కడి నుండేనని, మీ అందరూ నన్ను నిండు మనసుతో ఆశీర్వదించి మెజార్టీతో గెలిపించినందుకు కుత్బుల్లాపూర్ ప్రజానీకానికి ఎప్పుడూ రుణపడి ఉంటానన్నారు.
అనంతరం వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ.. జయదర్శిని ఎంక్లేవ్ నందు మంచి నీటి సమస్య తీవ్రంగా ఉండేదని ఎమ్మెల్యే చొరవతో సమస్య పరిష్కారమైందన్నారు. మంచినీటి సమస్యను పరిష్కరింపచేసిన ఎమ్మెల్యేకు వెల్ఫేర్ అసోసియేషన్ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో కొంపల్లి మాజీ మున్సిపల్ ఛైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్, నాయకుడు చింతల దేవేందర్ యాదవ్, వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు కొండల్ రావు, వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మహేందర్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ చిన్నా రెడ్డి, కోశాధికారి కృష్ణ కిషోర్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
Prabhas Spirit | మెక్సికోలో షూటింగ్.. ప్రభాస్ స్పిరిట్ అప్డేట్ పంచుకున్న సందీప్ వంగా
Lucifer 2 Empuraan | మోహన్ లాల్ ‘ఎల్2 ఎంపురాన్’ సినిమాపై 17 సెన్సార్ కట్స్
Pawan Kalyan | ఉగాది రోజు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి కిక్కిచ్చే న్యూస్.. ఇక సమయం లేదు మిత్రమా..!