Lucifer 2 Empuraan | మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్ (Mohan Lal) ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ఎల్2 ఎంపురాన్ (L2 Empuraan). ఈ సినిమాకు నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) దర్శకత్వం వహించాడు. మంజు వారియర్ (Manju Warrier), టోవినో థామస్(Tovino Thomas), ప్రధాన పాత్రల్లో నటించారు. 2019లో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం లుసిఫర్ (Lucifer) సినిమాకు కొనసాగింపుగా ఈ చిత్రం వచ్చింది. మార్చి 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మలయాళ సినమాలోనే ఆల్‌టైం కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. అయితే ఈ మూవీకి సంబంధించి కొన్ని సన్నివేశాలపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ వివాదంకు సంబంధించి రీ సెన్సార్ చేసింది చిత్రబృందం. రీ సెన్సార్ చేసిన అనంతరం దాదాపు 17 కట్స్ చెప్పినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం కట్స్ చెప్పిన సీన్స్ లేకుండా మూవీని విడుదల చేసినట్లు తెలుస్తుంది.
ఈ సినిమాలో 2002లో గుజరాత్లో జరిగిన గోద్రా సంఘటనలో జరిగిన ప్రధాన సన్నివేశాలను చిత్రీకరించారు. అలాగే ఈ మూవీలో నటించిన సయ్యద్ మసూద్ (పృథ్వీరాజ్ సుకుమారన్) అనే పాత్రకి సంబంధించి అతడి కుటుంబాన్ని ఒక వర్గానికి చెందిన నాయకుడు చంపడంతో పాటు హత్యచారం చేయడం.. ఆ తర్వాత అతడు రాజకీయ రంగంలోకి ప్రవేశించి పెద్ద నాయకుడిగా ఎదగడం చూపించారు. అయితే సీన్స్‌పై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఒక వర్గాన్ని అవమానకరంగా చిత్రీకరించే విధంగా ఈ దృశ్యాలు ఉన్నాయని విమర్శలు వస్తున్నాయి. మరోవైపు ఈ సీన్స్ నిజం అంటూ కొందరూ కామెంట్లు పెడుతున్నారు.