Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ని వెండితెర మీద చూడక చాలా రోజులు అవుతుంది. రాజకీయాలలోకి వచ్చాక పవన్ అసలు సినిమాలపై దృష్టి పెట్టడం లేదు.ఇక డిప్యూటీ సీఎం అయ్యాక ఇతర కార్యక్రమాలతో చాలా బిజీగా ఉంటున్నారు పవన్. దీంతో తాను కమిటైన సినిమాలు పూర్తి చేసేందుకు సమయం కుదరడం లేదు. పవన్ నటించి హరిహర వీరమల్లు చిత్రం ఈ నెలలో విడుదల కావల్సి ఉండగా, కొన్ని కారణాల వలన వాయిదా పడింది. మేలో రిలీజ్ అవుతుందని అన్నారు. అయితే ఉగాది రోజు పవన్ కళ్యాణ్‌కి సంబంధించి ప్రత్యేక పోస్టర్ విడుదల చేస్తూ మే 9న హరి హర వీరమల్లు రిలీజ్ కాబోతుందని కన్ఫాం చేశారు. దీంతో పవన్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
పవన్‌కల్యాణ్ కెరీర్లో తొలి ఫోక్లర్ మూవీ ‘హరిహర వీరమల్లు’ కాగా,ఈ చిత్రంలో పవన్ రాబిన్‌హుడ్ తరహా పాత్ర పోషిస్తున్నారు. ఉన్నవాళ్లను కొట్టి.. లేనివాళ్లకు పెట్టే ధీరోదాత్తుడిగా ఇందులో పవన్‌కల్యాణ్ కనిపించి అలరించనున్నారు. రెండు భాగాలుగా రూపొందుతోన్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లోని కొంత భాగాన్ని క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించగా, మిగతా భాగానికి దర్శకుడు జ్యోతికృష్ణ. ఏళ్ల తరబడి చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం ఎప్పుడెప్పుడు పూర్తవుతుందా? ఎప్పుడు విడుదల అవుతుందా? అని పవన్ అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. నిజానికి ఈ సినిమా ఈ నెల 28నే విడుదల కావాలి. కానీ షూటింగ్ ఆలస్యం వల్ల రిలీజ్ డేట్‌ని మే 9కి వాయిదా వేశారు.
ప్రస్తుతం మూవీ చివరి షెడ్యూల్ ఖమ్మంలో ప్రారంభమైనట్టు చిత్రవర్గాలు చెబుతున్నాయి. అయితే.. ఈ షూటింగ్లో పవన్ పాల్గొంటారా లేదా అనేది తెలియాల్సివుంది. ఈ షెడ్యూల్‌తోనే షూటింగ్ పూర్తి కానుందని, ఆ తర్వాత పోస్ట్‌ప్రొడక్షన్ పనులను వేగవంతం చేసి మేలో మూవీని రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తుంది. ఇక నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో బాబీడియోల్, నోరా ఫతేహి, అనసూయ భరద్వాజ్ ఇతర పాత్రధారులు. 17వ శతాబ్దంలో మొఘల్ సామ్రాజ్యపు బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీ తెరకెక్కుతోంది. మొఘల్ సామ్రాజ్యాధినేతల అణచివేతకు వ్యతిరేకంగా పోరాడే వీరుడిగా పవన్ కనిపించనున్నాడు. పవన్ కెరీర్లోనే తొలి పాన్ ఇండియా మూవీ అయిన ‘హరిహర వీరమల్లు’లో బాబీ డియోల్ మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాత్రను పోషిస్తున్నాడు. ఇంకా అనుపమ్ ఖేర్, జిషుసేన్ గుప్తా, నర్గీస్ ఫక్రీ కీలకపాత్రల్లో కనిపించి అలరించనున్నారు.