Prabhas – Sandeep Reddy Vanga | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, అర్జున్ రెడ్డి, యానిమల్ చిత్రాల దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా కాంబోలో రాబోతున్న చిత్రం ‘స్పిరిట్’(Spirit). దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్‌తో రానున్న ఈ మూవీని టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ నిర్మించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రోడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి అప్డేట్స్ కోసం ప్రభాస్ అభిమానులంతా కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ చిత్రం ఈ ఏడాది చివరిలో సెట్స్ మీదకి వెళ్లనున్నట్లు టాక్ నడుస్తుంది. ఇదిలావుంటే తాజాగా ఈ మూవీ షూటింగ్‌కి సంబంధించి సాలిడ్ అప్డేట్ను పంచుకున్నాడు దర్శకుడు సందీప్.
ఉగాది పండుగా వేడుకలలో పాల్గోన్న ఆయన మాట్లాడుతూ.. ప్రభాస్ స్పిరిట్ సినిమా షూటింగ్‌ను మెక్సికోలో జరుపబోతున్నట్లు ప్రకటించాడు. ఇంతకంటే ఏం అప్డేట్ ఇవ్వలేమని తెలిపాడు. ఈ సినిమాలో ప్రభాస్ మూడు కొత్త లుక్స్‌లో కనిపించనున్నట్లు తెలుస్తుంది. అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమా తరహాలో ‘స్పిరిట్’లో కూడా ప్రభాస్‌ను డిఫరెంట్‌గా చూపించబోతున్నట్లు సమాచారం. వచ్చే నెలలో సినిమాని ప్రారంభించి… జనవరి నుంచి రెగ్యులర్ చిత్రీకరణ మొదలు పెట్టనున్నట్లు తెలిసింది. ఆరునెలల్లోనే ఈ సినిమా షూటింగ్‌ను కంప్లీట్ చేయబోతున్నట్లు సమాచారం.
#Spirit shoot is going to happen in Mexico..
– @imvangasandeep#Prabhas pic.twitter.com/U6SV8Z53o1
— Suresh PRO (@SureshPRO_) March 30, 2025