MLA Marri Rajashekar Reddy | మల్కాజిగిరి, జూన్ 21 : ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ ఆశయాలను నెరవేర్చడానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. శనివారం బోయిన్ పల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి నివాళులర్పించారు.
బీఆర్ఎస్ నాయకులు మల్కాజిగిరి చౌరస్తాలో ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమ నాయకులు జేఏసీ వెంకన్న, మురుగేష్, ఉపేందర్, నర్సింగ్, ఖలీల్, సిద్ది రాములు, కృష్ణ గౌడ్, ఏస్ నర్సింగ్, బాబురావు, సైదుల్, కృష్ణ, ఉస్మాన్, బిక్షపతి, వెంకటేష్, జనార్ధన్, నవీన్, శ్రీకాంత్, మురళి, విష్ణు, సాయి గౌడ్, సుమన్, అనిల్, వినీత్, మధు, విజయ్, రాజేష్, బాలు, వాసు, తదితరులు పాల్గొన్నారు.
Sarangapur | కాలువల్లో పేరుకుపోయిన మురుగు.. వర్షం పడితే రోడ్డుపై నడువాలంటే చెప్పులు చేతపట్టాల్సిందే
Pension | పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయండి.. విద్యుత్ ఉద్యోగుల జేఏసీ డిమాండ్