MLA Marrirajashekar Reddy | మల్కాజిగిరి, జూన్ 16 : కాంగ్రెస్ పార్టీ ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొంటామని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. సోమవారం ఫార్ములా ఈ రేసింగ్ కేసులో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఏసీబీ విచారణ నేపథ్యంలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కేటీఆర్‌కు మద్దతుగా తెలంగాణ భవన్‌కు కార్పొరేటర్లు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లిందని, అందుకే బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన కేసులు పెట్టి విచారిస్తుందని అన్నారు. ఎన్ని కేసులు పెట్టినా న్యాయస్థానాల్లో న్యాయం కోసం పోరాడుతామని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంబీసీ మాజీ చైర్మన్ నందికంటి శ్రీధర్, కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్, బిఆర్ఎస్ నాయకులు బద్ధం పరశురాం రెడ్డి, రావుల అంజయ్య, జేఏసీ వెంకన్న, రాము యాదవ్, ఏకే మురుగేష్ , అనిల్ కిషోర్, జీకే హనుమంతరావు, చిన్న యాదవ్, శ్రీనివాస్ గౌడ్, భాగ్యానంద్, సత్యనారాయణ, ఉస్మాన్, ఉపేందర్, నరేందర్ రెడ్డి, డోలీ రమేష్ , ఢిల్లీ పరమేష్, శోభన్ బాబు, లక్ష్మణ్ యాదవ్, శ్రీనివాసులు, శరణ్ గిరి, సురేష్, హేమంత్ పటేల్, చిందం శ్రీనివాస్, అరుణ్ రావు, నర్సింగ్ రావు, వాసు,సాయి గౌడ్, సుమన్ గౌడ్, పవన్, ప్రశాంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Inter Results | ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. ఫస్టియర్‌లో 67.. సెకండియర్‌లో 50శాతం పాస్
OTT | డైరెక్ట్‌గా ఓటీటీలోకి ఉప్పు కప్పురంబు.. స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడంటే..!
Narsimhulapeta | ఖాజామియాకు ఆర్థిక సాయం అందజేత