MLA Bandari Laxma reddy | రామంతాపూర్, జూలై 2 : రామంతాపూర్ డివిజన్లో అభివృద్ధి పనుల్లో భాగంగా బుధవారం ఏడీఆర్ఎం హాస్పిటల్ నుండి కార్డినల్ గ్రేసెస్ స్కూల్ వరకు 1 కోటి 30 లక్షలతో చేపట్టే బీటీ రోడ్డు నిర్మాణానికి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, స్థానిక కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకటరావుతో కలిసి శంకుస్థాపన చేశారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతీ డివిజన్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఇప్పటికీ అన్ని డివిజన్లలో కోట్లాది రూపాయలు అభివృద్ధి పనులు సాగుతున్నాయని తెలిపారు. అనంతరం కార్పొరేటర్ బండారు శ్రీవాణి మాట్లాడుతూ.. రామంతాపూర్ డివిజన్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో బస్తీ పెద్దలు బాలరాజు , కాపర్తి మోహన్, రమేష్, బిజెపి నాయకులు కుమార్ స్వామి, నిరంజన్ గౌడ్, దయాకర్ రెడ్డి కృష్ణమూర్తి,టిఆర్ఎస్ నాయకులు పోసాని పవన్, మహమ్మద్ జాంగిర్, మంజుల, ఇందిరా, శ్రీకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
SIGACHI | మృతుల కుటుంబాలకు రూ. కోటి చొప్పున పరిహారం.. సిగాచీ పరిశ్రమ ప్రకటన
Phoenix Movie | ఈ సినిమాకు ముందు 120 కిలోలున్నా : విజయ్ సేతుపతి కుమారుడు సూర్య