MLA Mallareddy | జవహర్‌నగర్, ఏప్రిల్ 17: ప్రజల దాహార్తి తీర్చడం అభినందనీయమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. ఇవాళ జవహర్‌నగర్ కార్పొరేషన్‌లోని సాయిబాబాకమాన్ సమీపంలో మాజీ కార్పొరేటర్ జిట్టా శ్రీవాణి, శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మల్లారెడ్డి, మాజీ మేయర్ మేకల కావ్య సమక్షంలో చలివేంద్రాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ.. వేసవిని దృష్టిలో పెట్టుకుని అత్యవసరమైతేనే ప్రజలు బయటకు వెళ్లాలని అన్నారు. వడదెబ్బ నివారణ చర్యలు తీసుకోవాలని డాక్టర్లకు ఇప్పటికే సూచించామని, దాతలు ముందుకు వచ్చి చలివేంద్రాలు ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేయడం శుభపరిణామమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు మేక లలితాయాదవ్, సంగీతా రాజశేఖర్, సతీష్‌కుమార్, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కొండల్ ముదిరాజ్, జవహర్‌నగర్ ఉద్యమకారుల సంఘం అధ్యక్షుడు సుధాకర్‌చారి, నాయకులు నర్సింహాయాదవ్, ప్రసాద్‌గౌడ్, నవీన్‌గౌడ్, మహేశ్, ఖాసీం, ప్రశాంతి, శోభా, మంజుల తదితరులు పాల్గొన్నారు.
Minister Ponguleti | భూ వివాదాలు లేని రాష్ట్రంగా భూ భారతి చట్టం : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
Amit Shah: సీఆర్పీఎఫ్ 86వ రైజింగ్ డే.. 2026 నాటికి నక్సలిజం ఇక చరిత్రే: అమిత్ షా
Illegally Sand | అక్రమంగా నిల్వ చేసిన ఇసుకను సీజ్ చేసిన తహసీల్దార్ అనిత