Shambipur Krishna | దుండిగల్, మార్చి18 : ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్నామని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ నాయకుడు, దుండిగల్ మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్ శంభీపూర్ కృష్ణ అన్నారు. శంభీపూర్లోని ఆయన కార్యాలయంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, సంక్షేమ సంఘాల నేతలు, యువజన సంఘాల ప్రతినిధులు శంభీపూర్ కృష్ణను మర్యాదపూర్వకంగా కలిసారు.
ఈ సందర్భంగా తమ తమ బస్తీలు, కాలనీలలోని పలు సమస్యలు తెలియజేయడంతోపాటు పరిష్కరించాలని కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన ఆయన ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని, ప్రజలందరికీ ప్రతిరోజు అందుబాటులో ఉంటానని తెలిపారు.
మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద సహకారాలతో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.
MLC Kavitha | బీసీ రిజర్వేషన్ల బిల్లుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు
Danam Nagender | సహచర ఎమ్మెల్యేలపై దానం నాగేందర్ సీరియస్
Amitabh Bachchan: షారూక్, విజయ్ను దాటేసిన బిగ్ బీ.. 120 కోట్ల ట్యాక్స్ కట్టిన అమితాబ్ బచ్చన్