CM Kcr | ఆడబిడ్డలకు కేసీఆర్ పెద్దన్న : ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి

కాప్రా : తెలంగాణ సర్కారు ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలతో పేదప్రజలకు ఆర్థిక భరోసా కలుగుతుందని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు. శనివారం కాప్రా రెవెన్యూ మండల పరిధిలోని కాప్రా, ఏఎస్‌రావునగర్, చర్లపల్లి డివిజన్ల పేద ప్రజలకు మంజూరైన కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులను 102మంది లబ్దిదారులకు ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాప్రా మండల తాసిల్దార్ ఎస్తేరు అనిత అధ్యక్షతన ఏర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆడబిడ్డలను కన్న తల్లిదండ్రులకు సీఎం పెద్ద దిక్కుగా ఉన్నారనీ, ఇంటికి పెద్దన్నగా ఉండి వారి వివాహాలకు రూ.లక్షా పదహారు వేలు ఆర్థిక సహాయం అందిస్తున్నారని అన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను మహాయజ్ఞంలా కొనసాగిస్తూ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు.ఈ కార్యక్రమంలో తాసిల్దార్ అనిత, కార్పొరేటర్లు స్వర్ణరాజు, బొంతు శ్రీదేవి, మాజీ కార్పొరేటర్ పావనీ మణిపాల్‌రెడ్డి, కాప్రా ఆర్ఐ శాలిని, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు సుడుగు మహేందర్‌రెడ్డి, బేతాల బాలరాజు, నాయకులు సీతారాంరెడ్డి, కుమారస్వామి, బాలనరసింహ, జేసీబీ రాజు, వీఆర్ఏ యాదయ్య, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
‘ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారం చెల్లించాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

