Uppal MLA Bethi Subhash Reddy | ఆలయాల అభివృద్ధికి కృషి : ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి..

రామంతాపూర్ : దేవాలయాల అభివృద్ధి కి తమ వంతు కృషి చేస్తామని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు. సోమవారం పాతరామంతాపూర్లోని మల్లి కార్జున స్వామి దేవాలయం స్థలంలో రూ.17 లక్షల 50 వేలతో చేపట్టే కల్యాణ మండపానికి భూమిపూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మల్లికార్జునస్వామి దేవాలయానికి ఎంతో విశిష్టత ఉందన్నారు. కల్యాణ మండప నిర్మాణానికి ధర్మకర్తలు మందుకు రావడం అభినందనీయమన్నారు. స్థానిక కార్పొరేటర్ బండారుశ్రీవాణి వెంకట్రావు మాట్లాడుతూ దేవాలయానికి కల్యాణ మండపం ఎంతో అవసరమన్నారు.
కల్యాణ మండప నిర్మాణాకి తమ వంతు సహాకారం అందిస్తామన్నారు. ఆలయ చైర్మన్ ముట్కూరి దయాకర్‌రెడ్డి మాట్లాడుతూ దాతల సహాకారంతో కల్యాణ మండప నిర్మాణం సుందరంగా చేపడుతామన్నారు. ఆలయ ధర్మకర్తలు పూర్తిస్తాయిలో సహాకారం అందిస్తున్నామని అన్నారు. మరింత మంది దాతల సహకారం తీసుకొని త్వరిత గతిన నిర్మాణం పనులు పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ సూరంకృష్ణ, అర్చకులు ఎం. శేఖర్‌బాబు శర్మ, టీఆర్ఎస్ నాయకులు వెంకటేశ్వర్‌రెడ్డి, గడ్డం రవికుమార్, తూటి నర్సింహ, రవి, ఆనంద్‌యాదవ్ , బీజేపీ నాయకులు రేవు నర్సింహ, నందకిషోర్‌యాదవ్, శైలేందర్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

