Rail Accident | ఘట్ కేసర్, మే 25: రైలు ఢీకొని గుర్తు తెలియని ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన ఘట్ కేసర్ రైల్వే స్టేషన్ పరిధి యంనంపేట్ సమీపంలో ఇవాళ జరిగింది. రైల్వే హెడ్ కానిస్టేబుల్ కోటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం ఘట్ కేసర్ రైల్వే స్టేషన్ పరిధి యంనంపేట్ సమీపంలో రైలు పట్టాల పక్కన నడుస్తున్న ఒక వ్యక్తి(60)ని గోల్కొండ ఎక్స్ ప్రెస్ ఢీకొట్టడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు.
మృతుడి వద్ద ఎలాంటి గుర్తింపు పత్రాలు లభించలేదు. మృతుడు ప్యాంట్ మాత్రమే ధరించి ఉన్నాడని, ఎత్తు 5.6 అడుగులు, చామని ఛాయ రంగు, బట్టతల, తెల్లని గడ్డంతో ఉన్నట్లు తెలిపారు. మృతుని ఆచూకీ తెలిసినవారు సికింద్రాబాద్ జీఆర్పీ పోలీస్ ఇన్ స్పెక్టర్ 8712658581, దర్యాప్తు అధికారి 9666 280808 లను సంప్రదించాలని కోరారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుగుపుతున్నట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ కోటేశ్వరరావు తెలిపారు.