Hyderabad | జగద్గిరిగుట్ట ఫిబ్రవరి 18 : ఫీడర్ మరమత్తుల కారణంగా బుధవారం జగద్గిరిగుట్టలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్టు ఏఈ రాధా కిషన్ రెడ్డి తెలిపారు. షిరిడి హిల్స్ ఫీడర్ పరిధిలోని రాజీవ్ గృహకల్ప, షిరిడి హిల్స్, అంజయ్య నగర్, భూదేవి హిల్స్ , కూన మహాలక్ష్మి నగర్, అంజయ్యనగర్ సి బ్లాక్ ప్రాంతాల్లో మధ్యాహ్నం 11 నుంచి 1 గంట వరకు వరకు సరఫరా ఉండదని పేర్కొన్నారు. అలాగే జగద్గిరిగుట్ట ఫీడర్ పరిధిలోని జగద్గిరి నగర్ అంజయ్యనగర్, బీరప్పనగర్ మైసమ్మనగర్, సోమయ్యనగర్ ప్రాంతాల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 వరకు కరెంటు ఉండదని చెప్పారు.
వేసవి నేపథ్యంలో ఫీడర్ మరమ్మతు, లైన్లమార్పిడి పనులు జరుగుతున్నందున వినియోగదారులు సహకరించాలని ఏఈ రాధాకిషన్ రెడ్డి కోరారు