జీడిమెట్ల, జూన్ 7 : ఓ యువకుడిపై నలుగురు వ్యక్తులు దాడి చేసి అతని వద్దనున్న నగదు, సెల్‌ఫోన్, ఎటీఎం కార్డును దోచుకున్న సంఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులొకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మేడ్చల్ జిల్లా బాచుపల్లికి చెందిన చింతల రమేష్ సాయి అనే వ్యక్తి షాపూర్‌నగర్‌కు ఓ వ్యక్తి చిరునామా కోసం సోమవారం వచ్చాడు.
అ వ్యక్తి చిరునామా దొరకకపోవడంతో దారిపోతున్న ఓ వ్యక్తిని అడుగగా సదరు వ్యక్తి చిరునామా చెబుతానని మరో ముగ్గురితో కలిసి రమేష్‌ను చితకబాది అతని వద్దనున్న రూ.1500, సెల్ ఫోన్, ఏటీఎం కార్డును లాక్కొని పరారయ్యారు. దీంతో బాధితుడు జీడిమెట్ల పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.