అల్వాల్ నవంబర్ 19 : తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు డిమాండ్ చేశారు.
ఈ మేరకు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో మంత్రి పోన్నం ప్రభాకర్‌కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఉద్యమకారులు మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు కావస్తున్న ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చలేదన్నారు.
వెంటనే హామీలను నెరవేర్చచి ఉద్యమకారులను అదుకోవాలని మంత్రిని కోరారు. స్పందించిన మంత్రి ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి హామీలను అమలు కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు చీమ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల సురేందర్ రెడ్డి, పుట్నాల కృష్ణ, ఉద్యమకారులు, తదితరులు పాల్గొన్నారు.