JNTUH | కేపీహెచ్‌బీ కాలనీ, ఏప్రిల్ 17: జేఎన్టీయూహెచ్ యూనివర్సిటీలో నిర్వహించిన టెక్నికల్ ఫెస్ట్ ఘనంగా ముగిసింది. ఇవాళ టెక్నికల్ ఫెస్ట్‌ను వర్సిటీ రెక్టార్ విజయ్ కుమార్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ జి. వెంకట నరసింహారెడ్డి, వైస్ ప్రిన్సిపల్ పద్మావతిలు పరిశీలించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థులు నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించాలని, సమాజానికి ఉపయోగపడే పరిశోధనలు చేయాలని సూచించారు. వర్సిటీ అనుబంధ కళాశాలల విద్యార్థులు ప్రతిభను సృజనాత్మకతను జోడించి రూపొందించిన ప్రాజెక్టులు అద్భుతంగా ఉన్నాయని అభినందించారు. అనంతరం విద్యార్థులు ఆటపాటలతో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా విభాగాల అధికారులు, ఆధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Minister Ponguleti | భూ వివాదాలు లేని రాష్ట్రంగా భూ భారతి చట్టం : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
Amit Shah: సీఆర్పీఎఫ్ 86వ రైజింగ్ డే.. 2026 నాటికి నక్సలిజం ఇక చరిత్రే: అమిత్ షా
Illegally Sand | అక్రమంగా నిల్వ చేసిన ఇసుకను సీజ్ చేసిన తహసీల్దార్ అనిత