Students | కుత్బుల్లాపూర్, జూలై 14: విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత లక్ష్యాలను చేరేందుకు ముందుగానే ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని స్కైడ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో హ్యూమన్, కార్పొరేట్ రిలేషన్స్ వైస్ ప్రెసిడెంట్ వెంకట్ ఆర్కె సూచించారు. సోమవారం దూలపల్లి సెయింట్ మార్టిన్ ఇంజినీరింగ్ కళాశాలలో కెరీర్ రెడీనెస్ ప్లాన్‌పై నిపుణుల ప్రసంగం జరిగింది.
ఈ సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సరైన మనస్తత్వం, వ్యూహాలతో విద్యార్థులు తమ భవిష్యత్ కెరీర్లకు సిద్ధం కావడంపై మార్గనిర్దేశం ఎంచుకోవాలన్నారు. కెరీర్ ప్లానింగ్, పరిశ్రమ అంచనాలు, నైపుణ్య అభివృద్ధిపై విలువైన సలహాలు, సూచనలు పంచుకుంటూ ఆయన స్ఫూర్తిదాయకమైన ప్రసంగం చేశారు.
సెయింట్ మార్టిన్ ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ కే రవీంద్ర తన సమావేశంలో ప్రసంగించారు. విద్యార్థులు తమ ప్రకాశవంతమైన కెరీర్లను రూపొందించుకోవడానికి కీలకమైన మార్గదర్శకాలను అందించారు.
విద్యా సంస్థల చైర్మన్ మర్రి లక్ష్మణ్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జి చంద్ర శేఖర్ యాదవ్, సెయింట్ మార్టిన్ ఇంజనీరింగ్ కళాశాల నిర్వహణ బృందం కూడా తమ ఉనికితో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
Juluri Gourishankar | జూలూరి గౌరీశంకర్ రచించిన ‘బహుజనగణమన’ ఆవిష్కరణ
Student | అదృశ్యమైన ఆరు రోజుల తర్వాత.. యమునా నదిలో శవమై తేలిన ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని