Keesara Ward Office | కీసర, జూన్ 7 : కీసరలోని వార్డు కార్యాలయాన్ని తొలగించడానికి ప్రయత్నాలు చేస్తున్న మున్సిపల్ అధికారుల పనితీరుకు నిరసనగా ఈ నెల 8వ తేదీన కీసరలో పెద్ద ఎత్తున ధర్నాకార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పలు పార్టీల నేతలు తెలిపారు. కీసరలో సుమారు 20 వేల జనాభా ఉందని, ప్రజల అవసరాల నిమిత్తం దమ్మాయిగూడ మున్సిపాలిటీకి వెళ్లాలంటే చాలా ఇబ్బందులకు గురి అవుతున్నామని తెలిపారు.
కీసర ప్రజా సమస్యలను కీసర వార్డు కార్యాలయంలో విన్నవించుకోవడానికి అవకాశం ఉంటుందని, అలాంటి వార్డు కార్యాలయాన్ని తొలగించడానికి మున్సిపల్ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు అన్ని పార్టీల ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 11 గంటలకు మన వార్డు కార్యాలయం మన కీసరలోనే ఉండే విధంగా అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా ద్వారా మనమంతా నిరసన వ్యక్తం చేయడానికి సిద్దం కావాలని పిలుపునిస్తున్నారు. ఇట్టి నిరసన కార్యక్రమంలో కీసర ప్రజలంతా అధిక సంఖ్యలో పాల్గొనాలని తెలిపారు.
Read Also :
Hospital Staff | అమానుషం.. ఐసీయూలోని రోగికి మత్తుమందు ఇచ్చి అత్యాచారం
Bakrid Celebrations | ఘనంగా బక్రీద్ వేడుకలు.. ఈద్గాల వద్ద ప్రార్థనలు చేసిన ముస్లిములు