శామీర్పేట, మార్చి 22 : వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని నీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు తూంకుంట మున్సిపల్ కమిషనర్ వెంకటగోపాల్ సూచించారు. వన్ డే వన్ థీమ్ కార్యక్రమంలో భాగంగా శనివారం నాడు తూంకుంట మున్సిపాలిటీ శామీర్పేటలో నీటి సమస్య, వీధి కుక్కల సమస్యలపై పర్యటించారు.
వీధి కుక్కల సమస్య ఎక్కువగా ఉండటంతో బ్లూ క్రాస్ సొసైటీతో మాట్లాడి వాటిని పట్టించారు. అనంతరం పెద్దమ్మ కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా తాము ఎదుర్కొంటున్న నీటి సమస్య గురించి ప్రజలు వివరించారు. అనంతరం నీటి సమస్యలకు పరిష్కార మార్గాలు చూపాలని గ్రామపెద్దలకు సూచించారు.