Sanitation | శానిటేషన్ విభాగంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ తమ విధివిధానాల పట్ల అంకితభావంతో పనిచేస్తూ ప్రజలకు సురక్షితమైన వాతావరణం అందించడమే లక్ష్యంగా ఫిర్యాదులు రాకుండా చర్యలు తీసుకోవాలని కొంపల్లి మున్సిపల్ కమిషనర్ కృష్ణారెడ్డి సూచించారు. శనివారం ఉదయం కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలో వీధి వీధిన తిరుగుతూ శానిటేషన్ విభాగంపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు.
గత కొన్ని రోజులుగా ప్రజల నుండి వస్తున్నటువంటి పలు ఫిర్యాదులపై స్పందించిన అధికారులు ఎట్టకేలకు క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో ఆయా వీధుల్లో ఉన్న ప్రజలు అధికారుల దృష్టికి శానిటేషన్ అంశంపై పలు ఫిర్యాదులను నేరుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
వీటిపై స్పందించిన కమిషనర్ కృష్ణారెడ్డి ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించడంతోపాటు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా క్షేత్రస్థాయిలో అధికారులు సిబ్బంది ఐక్యమత్యంతో పని చేయాలని పలు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయా విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Fake Seeds | నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు : తొగుట సీఐ లతీఫ్
Ramayampet | లారీ – బైక్ ఢీ.. ఒకరికి తీవ్రగాయాలు
రామాయంపేటలో పాఠ్య పుస్తకాలు సిద్దం.. విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే అందజేత