Cell Tower | దుండిగల్, జూలై 9: దుండిగల్ మున్సిపాలిటీ 2వ వార్డు పరిధిలోని శ్రీనివాస కాలనీలో జనావాసాల మధ్య ఓ ఇంటి యజమాని సెల్ టవర్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని దానికి అనుమతులు ఇవ్వకూడదంటూ పలువురు కాలనీవాసులు బుధవారం మున్సిపల్ వెంకటేశ్వర నాయక్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శ్రీనివాస కాలనీ, వివేకానందుడి విగ్రహం పక్కన ఉన్న బస్తీలో శ్రీను అనే వ్యక్తి తన ఇంటిపైన సెల్ టవర్‌ను ఏర్పాటు చేసేందుకు పనులు జరుగుతున్నాయన్నారు. అదే జరిగితే గర్భిణీ స్త్రీలు, హర్ట్ పేషెంట్లు అనారోగ్యాలకు గురయ్యే అవకాశం ఉందన్నారు.
ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని సెల్ టవర్ నిర్మాణ పనులను నిలిపివేయడంతోపాటు బస్తీలో మరెక్కడా కూడా అనుమతులు ఇవ్వొద్దని కమిషనర్‌కు విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ మాజీ ఎంపీపీ చిన్నంగి వెంకటేశం, తాజా మాజీ కౌన్సిలర్ గోపాల్ రెడ్డి, పాండు గౌడ్ , వీరేందర్, మోహన్ దాస్ గౌడ్, భిక్షపతి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Nizampet | రైతులందరూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి : సోమలింగారెడ్డి
Dangerous Roads | నిత్యం ప్రమాదపు అంచున.. రోడ్ల మరమ్మతుల కోసం ప్రజల ఎదురుచూపు
Garbage | ఎక్కడ చూసినా వ్యర్థాలే.. వ్యవసాయ మార్కెట్ యార్డు కంపుమయం