MLA KP Vivekananda | దుండిగల్ : ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ప్రజల్లో శాంతి సామరస్యం.. భక్తి సమభావం నెలకొంటుందని కుత్బుల్లాపూర్ శాసనసభ్యుడు కేపీ వివేకానంద అన్నారు. రాజుల రామారం సర్కిల్ సూరారం డివిజన్ నల్లగుట్ట భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో బుధవారం కుత్బుల్లాపూర్ నియోజక వర్గం బీఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షులు దూదిమెట్ల సోమేశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన 24వ ద్వాదశ జ్యోతిర్లింగాల శివ పూజ మహోత్సవంలో ఎమ్మెల్యే వివేకానంద పాల్గొన్నారు.
శివ స్వాములతో కలిసి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల్లో సామాజిక సమగ్రతను పెంపొందించాలంటే ఇలాంటి కార్యక్రమాలు తరచు నిర్వహించాలని సూచించారు కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రుద్ర అశోక్ , పోలే శ్రీకాంత్, ఏర్వ శంకరయ్య నేతలు వేణు యాదవ్ ఫిరోజ్ తోపాటు నలుగురు శివ స్వాముల పాల్గొన్నారు. అలాగే, గాజులరామారం డివిజన్, ఇంద్రానగర్-ఏలోని పోచమ్మ దేవాలయం 9వ వార్షికోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే వివేకానంద పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవడంలో ఆలయాల పాత్ర ఎంతో ముఖ్యమైందన్నారు.