చర్లపల్లి, ఏప్రిల్ 28 : చర్లపల్లి డివిజన్ ఈసీనగర్ కాలనీ సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నామని ఈసీ నగర్ హౌజ్ బిల్డింగ్ సోసైటీ కమిటీ అధ్యక్షుడు బూడిద శ్రవణ్‌కుమార్ గౌడ్ పేర్కొన్నారు. చర్లపల్లి డివిజన్ ఈసీనగర్ కమ్యూనీటి హాల్లో కాలనీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీలో నెలకొన్న సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ముఖ్యంగా కాలనీలో డ్రైనేజీ, మంచినీటి సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
కాలనీలో సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. అనంతరం 2025ఆర్ధిక సంవత్సరానికి బడ్జెట్‌ను వివరించారు. ఈ కార్యక్రమంలో కాలనీ ఉపాధ్యాక్షుడు సీహెచ్.పద్మిని, ప్రధాన కార్యదర్శి జగ్గారాజు, కోశాధికారి కాసుల ఇందిరాగౌడ్, కమిటీ సభ్యులు భిక్షపతి, బాలయ్యగౌడ్, మల్లేశ్, బాల్‌రెడ్డి, భానుకుమార్, సత్తిరెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, కృష్ణారెడ్డిలతో పాటు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.