Shamirpet | శామీర్పేట, ఫిబ్రవరి 22 : శామీర్పేట కట్ట మైసమ్మ ఆలయ నూతన కమిటీని శనివారం ఎన్నుకున్నారు. శామీర్పేట కట్ట మైసమ్మ ఆలయ కమిటీ చైర్మన్ మ్యాకల మహేందర్ యాదవ్, వైస్ చైర్మన్లుగా వల్లపు ఎల్లం, ఇర్రి వెంకట్ రెడ్డి, కోశాధికారిగా బోయిని రాజు, జనరల్ సెక్రటరీగా బత్తిని రాంచందర్ గౌడ్, ఆలయ కమిటీ సభ్యులుగా దొంతరబోయిన మహేశ్, నీరుడి మధు, వలసమర్రి శేఖర్, బట్టు మచేందర్, మాదాసు శ్రీకాంత్, పడకంటి వెంకటేశ్ చారి, కుమ్మరి వెంకటేశ్, బాలేకర్ సాయి, గజ్వెల్లి శ్రీరాములు, బొనుగుల పరమేశ్, సోగడి చిన్న రమేశ్ ఎన్నికయ్యారు.
నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు శనివారం నాడు కట్ట మైసమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.