DostAdmissions | ఉప్పల్, మే 29 : ఉప్పల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్ల కోసం దోస్త్ 2025 ద్వారా రెండవ దశ రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. ఇంటర్మీడియట్లో పాసైన విద్యార్థులు మే 30 నుండి జూన్ 8వ తేదీ లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ డా. విజయ్ కుమార్ తెలిపారు. బీఏ, బీకాం, బీఎస్సీ ఎంపీసీ, ఏపీసీఎస్, బీజెడ్సీ మొదలైన కోర్సులు అందుబాటులో ఉన్నాయని, వెబ్ ఆప్షన్ లలో ఉప్పల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
మొదటి ఫేజ్లో కళాశాలలో సీట్ పొందిన విద్యార్థులు, కళాశాలలో చేరే ఆసక్తి గల విద్యార్థులు ఉప్పల్ కూరగాయల మార్కెట్ వద్ద గల కళాశాల కార్యాలయంలో సంప్రదించగలరని దోస్త్ అడ్మిషన్ల సమన్వయ కర్త జె. విశ్వనాథ్ కుమార్ ఒక ప్రకటనలో తెలియజేశారు. కళాశాల సిబ్బందిని 8985927019 ద్వారా సంప్రదించవచ్చన్నారు.
PM Modi | ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేసేవారికి ఆపరేషన్ సిందూర్ తగిన సమాధానం : ప్రధాని మోదీ
Sunkishala | సిటీకి సుంకిశాలే శరణ్యం.. కేసీఆర్ దిశలోనే కాంగ్రెస్ సర్కారు
Navy plane Crashes | ఘోర ప్రమాదం.. కూలిన నేవీ విమానం