TGSRTC Buses | బాలానగర్, ఏప్రిల్ 3 : కొత్తగా ఏర్పడిన కాలనీలు, బస్తీల ప్రజల సౌకర్యార్థం బస్సులను నడిపించే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు కూకట్పల్లి డిప్యూటీ రీజనల్ మేనేజర్ జి అపర్ణ కళ్యాణి తెలిపారు. ఇవాళ ప్రశాంత్ నగర్ ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ప్రజలకు బస్సులను మరింత చేరువ చేసి నడిపించేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తుందని తెలిపారు.
ఈ నేపథ్యంలోనే కూకట్పల్లి డివిజన్ పరిధిలోని కూకట్పల్లి, మియాపూర్ 2, జీడిమెట్ల మేడ్చల్ హెచ్‌సీయూ (హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ) డిపోల పరిధిలోని అన్ని ప్రాంతాల్లో ప్రజలకు బస్సు సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. కూకట్పల్లి డివిజన్ పరిధిలో మొత్తం 711 బస్సులు ప్రజా రవాణా కోసం పనిచేస్తున్నాయని, వాటిలో 543 బస్సులు ఆర్టీసీకి చెందినవి కాగా.. 163 బస్సులు అద్దెకు నడుస్తున్నాయన్నారు. వాటిలో 154 ఎలక్ట్రిక్ బస్సులు ప్రజలకు రవాణా అందిస్తున్నాయని తెలిపారు.
ఫతేనగర్‌కు బస్సు సౌకర్యం పున : పరిశీలిస్తాం..
ఫతేనగర్‌కు బస్సు సౌకర్యం కల్పించే అంశాన్ని పున: పరిశీలిస్తామని అపర్ణ కళ్యాణి తెలిపారు. గతంలో ఫతేనగర్ మీదుగా అమీర్‌పేట్, కోఠి, మెహిదీపట్నం తదితర ప్రాంతాలకు బస్సు సౌకర్యాలు ఉండేవని ఫతేనగర్ ఫ్లైఓవర్ పై డివైడర్లు ఏర్పాటు చేసిన కారణంగా బస్సులు తిరగలేని పరిస్థితిలో ఉన్నందున అప్పటి అధికారులు బస్సులను నిలిపివేసినట్లు పేర్కొన్నారు.
ప్రజల సౌకర్యార్థం ఈ విషయాన్ని ఉన్నతాధికారులతో పున : పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అదేవిధంగా జగద్గిరిగుట్ట ఈసీఐఎల్, బాలాజీ నగర్ తదితర ప్రాంతాలకు బస్సు సౌకర్యం కల్పించాలని విలేకరులు సూచించారు. వారి సూచన మేరకు ఉన్నతాధికారులతో చర్చలు జరిపి తగిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
Pooja Hegde | శ్రీకాళహస్తీ రాహుకేతు పూజలో పాల్గొన్న పూజా హెగ్డే
A Raja: బొట్టు పెట్టుకోవద్దు.. కంకణం కట్టుకోవద్దు.. డీఎంకే నేత ఏ రాజా వివాదాస్పద వ్యాఖ్యలు