హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పరిధిలో ఆర్టీసీ బస్సుకు ప్రమాదం తప్పింది. బస్సు హైదరాబాద్ నుంచి చేవెళ్ల వెళ్తుండగా మల్కాపూర్ గ్రామ పరిధిలో ఆర్టీసీ బస్సు, కారు ఢీకొన్నాయి. కారు ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవ్వడంతో కారులోని ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్ అప్రమత్తతతో బస్సులోని 25 మంది ప్రయాణికులు సురక్షితంగా బయపడ్డారు. రహదారి పనులలో జాప్యం కారణంగానే ప్రమాదాలు జరుతున్నాయని స్థానికుల ఆరోపణలు చేస్తున్నారు. రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలని కోరుతున్నారు.
చేవెళ్ల పరిధిలో ఆర్టీసీ బస్సుకు తప్పిన ప్రమాదం
హైదరాబాద్ నుండి చేవెళ్ల వెళ్తుండగా, మల్కాపూర్ గ్రామ పరిధిలో ఢీకొట్టుకున్న ఆర్టీసీ బస్సు, కారు
కారు ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవ్వడంతో కారులో ప్రయాణికులకు తప్పిన ప్రమాదం
డ్రైవర్ అప్రమత్తతతో సురక్షితంగా బయటపడ్డ బస్సులోని 25 మంది… pic.twitter.com/OswOs9fmAe
— Telugu Scribe (@TeluguScribe) May 24, 2026