కుత్బుల్లాపూర్ : హుజురాబాద్‌లో జరిగిన దళిత బంధు ఫథకం ప్రారంభోత్సవానికి కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ పార్టీ నాయకులు భారీగా తరలి వెళ్లారు. ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు సారథ్యంలో నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున వెళ్లారు. మార్గమధ్యలో శామీర్‌పేట ఔటర్‌రింగ్ రోడ్డు వద్ద మంత్రి కేటీఆర్ సభకు వెళ్తున్న క్రమంలో మర్యాదపూర్వకంగా కలుసుకొని ఆయనకు పుష్పగుఛ్చం అందించి ఘనస్వాగతం పలికి అనంతరం మంత్రి కేటీఆర్‌తో కలిసి దండుగా కదలివెళ్లారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ దుండిగల్, కొంపల్లి మున్సిపాలిటీలతో పాటు జంట సర్కిళ్ల ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు ఉన్నారు.