MLA Bandari Lakshma Reddy | చర్లపల్లి, జూన్ 16 : కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు విద్యార్థులకు ఫీజులలో రాయితీలు కల్పించాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. చర్లపల్లి కాలనీల సమాఖ్య ఆధ్వర్యంలో పేద, మద్య తరగతి విద్యార్థులకు కార్పొరేటర్, ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజులలో రాయితీ కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని కొరుతూ విద్యార్థుల తల్లిదండ్రులు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డికి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థలు విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలని సూచించారు. ముఖ్యంగా నియోజకవర్గ పరిధిలో కార్మిక, పేద, మధ్య తరగతి కుటుంబాలు అధికంగా ఉన్నాయన్నారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యార్థులకు ఫీజులలో రాయితీలు కల్పించాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో సీసీఎస్ అధ్యక్షుడు ఎంపెల్లి పద్మారెడ్డి, బీఆర్ఎస్ సినీయర్ నాయకుడు నేమూరి మహేశ్‌గౌడ్, అనిలారెడ్డి, భాగ్యలక్ష్మి, కళావతి, వేణుగోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Inter Results | ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. ఫస్టియర్‌లో 67.. సెకండియర్‌లో 50శాతం పాస్
OTT | డైరెక్ట్‌గా ఓటీటీలోకి ఉప్పు కప్పురంబు.. స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడంటే..!
Narsimhulapeta | ఖాజామియాకు ఆర్థిక సాయం అందజేత