Potholes | కీసర, జూన్ 2 ; అంకిరెడ్డిపల్లి రోడ్డు గుంతల మయంగా మారడంతో ప్రయాణికులు నరకయాతను అనుభవిస్తున్నారు. దమ్మాయిగూడ మున్సిపాల్టీ పరిధి అంకిరెడ్డిపల్లి రోడ్డు దుస్థితి మరి దారుణంగా మారిపోయింది. అంకిరెడ్డిపల్లి చౌరస్తా నుంచి అంకిరెడ్డిపల్లి వరకు రోడ్డు అడుగడుగునా గుంతలు పడి మరి దారుణంగా మారిపోయింది. ఈ రోడ్డు మార్గం గుండా ప్రయాణించాలంటే ప్రయాణీకులు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ప్రయాణించాల్సి వస్తుంది.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏ ఒక్క రోడ్డు పనులనుగాని, అభివృద్ధి పనులను చేసిన దాఖలాలు లేవని ప్రజలు ప్రభుత్వ పనితీరు మీద తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ప్రధానంగా రోడ్డుల పరిస్థితి మరి దారుణంగా మారిపోయింది. మండలంలోని పలు రోడ్డుల పరిస్థితి మరి దారుణంగా మారి ఈ రోడ్డు మార్గం గుండా రాత్రి సమయాల్లో ప్రయాణించాలంటే గుంతల్లో పడి దవాఖానల పాలు కావాల్సిన దుస్థితి నెలకొంటుందని అంకిరెడ్డిపల్లి వాసులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధికారులు ఇప్పటికైనా సంబంధిత స్పందించి గుంతల మయంగా మారిన అంకిరెడ్డిపల్లి రోడ్డును బాగు చేయాలని కోరుతున్నారు.
Medak | ఉద్యోగ, ఉపాధ్యాయుల హామీలను ప్రభుత్వం నెరవేర్చాలి: టీజీసీపీఎస్ ఈయూ నేత నర్సింహులు
Textbooks | పాపన్నపేట మండలంలో పాఠ్య పుస్తకాలు పంపిణీ చేసిన ఎంఈవో ప్రతాప్ రెడ్డి