Dr BR Ambedkar | ఘట్ కేసర్, మే 18: పేద పీడిత ప్రజల దైవం డాక్టర్ అంబేద్కర్ అని వజ్ర హాస్పిటల్ ఎండీ డాక్టర్ ప్రకాష్ అన్నారు. ఇవాళ ఘట్ కేసర్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి ప్రబుద్ద భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో నిత్య పూలమాల కార్యక్రమం నిర్వహించారు. అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రజలలోకి తీసుకువెళ్లేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
అంబేద్కర్ జీవిత చరిత్రను యువత అధ్యయనం చేసి ఆచరించాలని ఈ సందర్భంగా డాక్టర్ ప్రకాశ్ అన్నారు. అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం ప్రధాన కార్యదర్శి ఇరిటం శ్రీనివాస్, సత్యం, తాల్క రాములు, నర్సింగరావు, రామేశ్వర్, అంజయ్య, జగదీష్, కృష్ణం రాజు, ఉపేందర్, విష్ణు, భరత్ కుమార్, అఖిల్, వివేక్, యాకేష్, లలిత్, తదితరులు పాల్గొన్నారు.
Mirchowk | మీర్‌చౌక్ అగ్నిప్రమాదం ఎలా జరిగిందంటే?.. వివరించిన అధికారులు
Unwanted Hair | అవాంఛిత రోమాలతో బాధపడుతున్న మహిళలు.. ఈ చిట్కాలను పాటించాలి..!
Javed Akhtar | నరకానికి అయిన వెళ్తాను కానీ పాకిస్తాన్‌కు వెళ్లను : జావేద్ అక్తర్