Ration Cards | బాలానగర్, ఏప్రిల్ 19 : నిరుపేదలకు రేషన్ కార్డులు వచ్చే విధంగా వెరిఫికేషన్ చేయాలని బాలానగర్ డిప్యూటీ తహసీల్దార్ శృతికి ఓల్డ్ బోయిన్పల్లి కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ విజ్ఞప్తి చేశారు. ఇవాళ డివిజన్ పరిధిలోని అస్మాత్ పేట అంజయ్య నగర్ కమ్యూనిటీ హాల్లో రేషన్ కార్డ్ వెరిఫికేషన్ కార్యక్రమానికి డిప్యూటీ తహసీల్దార్ శృతి హాజరయ్యారు.
ఈ సందర్భంగా రేషన్ కార్డుల వెరిఫికేషన్ విషయమై కార్పొరేటర్ డిప్యూటీ తహసీల్దార్‌తో చర్చించారు. అనంతరం కార్పొరేటర్ నరసింహ యాదవ్ మాట్లాడుతూ.. కొత్త రేషన్ కార్డుల వెరిఫికేషన్ కార్యక్రమంలో భాగంగా నిరుపేదలకు తప్పనిసరిగా కార్డులు అందే విధంగా వెరిఫికేషన్ చేయాలని డిప్యూటీ తహసీల్దార్‌కు సూచించినట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానికులు, తదితరులు పాల్గొన్నారు.
Inter Results | ఈనెల 22న ఇంటర్ ఫలితాలు..
Dilip Ghosh | 60 ఏళ్ల వయసులో ప్రేయసిని పెళ్లాడిన బీజేపీ నేత.. ఫొటోలు వైరల్