మేడ్చల్ మల్కాజిగిరి : పేకాట స్థావరాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా
జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని హెచ్ఏఎల్ కాలనీలో గల ఓ ఇంట్లో(పేకాట స్థావరంపై)బాలనగర్ ఎస్ఓటీ పోలీసులు మెరుపుదాడి చేసి నిర్వాహకుడు ఆసిప్తో పాటు 9 మంది అరెస్ట్ చేశారు. 9 మొబైల్స్ తో పాటు 26,950 నగదు సీజ్ చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.