మేడ్చల్, జూలై 2: సీఎం కేసీఆర్ చేపట్టిన వినూత్న పథకాలతో ప్రజలు గౌరవంగా జీవిస్తున్నారని పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మేడ్చల్ మున్సిపాలిటీ కిష్టాపూర్ గ్రామంలో శుక్రవారం నిర్వహించిన హరితహారంలో మంత్రి మల్లారెడ్డితో కలిసి మొక్కలు నాటారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా కూడ లేని, ఎవరికి తట్టని పథకాలను రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రజలకు అందిస్తున్నారని తెలిపారు. ఆడబిడ్డ పెండ్లికి రూ.1లక్ష ఇచ్చి ఆదుకుంటున్న మహానుభావుడని కొనియాడారు. స్వరాష్ట్రం వచ్చిన తర్వాత 220 కోట్ల మొక్కలు నాటి సంరక్షిస్తున్నామన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ శ్వేతామహంతి, మున్సిపల్ చైర్పర్సన్ దీపిక, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాజశేఖర్‌రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి మహేందర్‌రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ రమేశ్, కౌన్సిలర్లు, నాయకులు శేఖర్‌గౌడ్, నర్సింహారెడ్డి, నవీన్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
శామీర్‌పేట: అన్నదాతల సంక్షేమానికి సీఎం కేసీఆర్ నిరంతరం పరితపిస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మేడ్చల్ జిల్లా శామీర్‌పేట రైతు వేదికలో కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డితో కలిసి రైతుబంధు కార్యాలయాన్ని ప్రారంభించి, రైతుబంధు కృతజ్ఞత సభలో రైతులకు అవగాహన కల్పించారు. మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేసేందుకు పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. రైతులు కందులు, పత్తి వంటి పంటలను సాగు చేసి ఆర్థికంగా ఎదగాలన్నారు. అలియాబాద్ బాలమ్మ, లాల్‌గడి మలక్‌పేట జయరాములు, శామీర్‌పేట వంగ మల్లమ్మ, తుర్కపల్లి వల్లపు పర్వతాలు రైతులను సన్మానించి సాయిల్ హెల్త్ కార్డులను అందజేశారు.
కార్యక్రమంలో జిల్లా రైతుబంధు అధ్యక్షుడు నందారెడ్డి, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్‌రెడ్డి, జడ్పీ వైస్‌చైర్మన్ వెంకటేశం, ఏఎంసీ చైర్మన్ సునీత లక్ష్మి, జడ్పీటీసీ అనిత, వైస్ ఎంపీపీ సుజాత, రైతుబంధు మండల అధ్యక్షుడు కంటం కృష్ణారెడ్డి, సర్పంచ్‌లు కుమార్‌యాదవ్, మోహన్‌రెడ్డి, వనజ, ఎంపీటీసీలు శ్రీనివాస్‌యాదవ్, అశోక్, అశోక్‌రెడ్డి, ఆర్డీవో రవి, డీఏవో మేరిరేఖ, ఏడీఏ వెంకట్రాంరెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఎండీ జహంగీర్, నియోజకవర్గ ఇన్చార్జి మహేందర్‌రెడ్డి, మద్దుల శ్రీనివాస్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి జగదీశ్‌గౌడ్, ఎంపీడీవో వాణి, తాసీల్దార్ సురేందర్, ఏవో రమేశ్, హెచ్‌వో శిల్ప, రైతుబంధు జిల్లా, మం డల, గ్రామ కన్వీనర్లు, రైతులు, పాల్గొన్నారు.
శామీర్‌పేట మండలంలోని అలియాబాద్, శామీర్‌పేట, లాల్‌గడి మలక్‌పేట, తుర్కపల్లి, యాడారం, బొమ్మరాశిపేట గ్రామాలకు చెందిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ 13 చెక్కులను మండల పరిషత్ కార్యాలయంలో మంత్రి మల్లారెడ్డి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. శామీర్‌పేటకు చెందిన రాకేశ్ ముఖ్యమంత్రి సహాయనిధి కింద మంజూరైన రూ.42500 చెక్కును అందజేశారు. అదే విధంగా గ్రామానికి ఒకటి చొప్పున శవపేటిక(ఫ్రీజర్)లను సర్పంచ్‌లకు అందజేశారు.
రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తన సొంత ఖర్చులతో శామీర్‌పేట మండలంలోని రైతులకు సహపంక్తి భోజనం ఏర్పాటు చేశారు. రైతుబంధు జిల్లా, మండల, గ్రామ కన్వీనర్లు, రైతులు, ప్రజాప్రతినిధులతో కలిసి సుమారు 600 మంది పాల్గొన్నారు.
మేడ్చల్: మేడ్చల్ మున్సిపాలిటీలో శుక్రవారం నిర్వహించిన కేదారీశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠోత్సవానికి పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి హాజరై పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రులను ఆలయ నిర్మాణదాతలు, పండితులు స్వాగతం పలికి సన్మానించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాజశేఖర్‌రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గ ఇన్చార్జి మహేందర్‌రెడ్డి, మేడ్చల్ మున్సిపల్ చైర్మన్ దీపిక, జడ్పీటీసీ శైలజ, ఆలయ నిర్మాణ దాత, మేడ్చల్ కౌన్సిలర్ హరికృష్ణ, నాయకులు నర్సింహారెడ్డి, శేఖర్‌గౌడ్, నవీన్‌రెడ్డి, శ్రీనివాస్, రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.