కొత్తగూడెం కార్పొరేషన్ సీపీఐదే.. కమ్మూనిస్టు పార్టీకి సపోర్ట్ చేస్తామని కేటీఆర్ ప్రకటన
ఇవాళ సింగరేణిని కాంగ్రెస్, బీజేపీలు కలిసి దోచుకుంటున్నాయి. సింగరేణిలో దోపిడిని అడ్డుకోవడంలో మాతో కలిసొస్తే సీపీఐకి మద్దతిస్తామని కేటీఆర్ అన్నారు.
హైదరాబాద్ : కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో హంగ్ ఏర్పడిన నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అసక్తికర కామెంట్స్ చేశారు. కొత్తగూడెంలో మాతో కలిసొస్తె సీపీఐకి అన్ కండిషనల్ సపోర్ట్ చేస్తామని కేటీఆర్ ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో మొత్తం 60 స్థానాలకు గానూ సీపీఐకి 22, కాంగ్ెస్కు 22, బీఆర్ఎస్కు 8, బీజేపీ, సీపీఎం పార్టీలకు చెరో స్థానం దక్కింది. మిగతా ఆరు చోట్ల ఇండిపెండెంట్లు విజయం సాధించారు. దీంతో అక్కడ హంగ్ ఏర్పడింది. ఇప్పడు మేయర్ పదవి దక్కాలంటే సీపీఐకి ఇంకా 9 స్థానాలు అవసరం. ఎమ్మెల్యే కూనమనేని ఎక్స్ ఆఫీసియో ఓటుతో పాటు బీఆర్ఎస్ 8 ఓట్లు కలిస్తే కొత్తగూడెం మేయర్ పీఠం సీపీఐకి దక్కే అవకాశముంది.
ఇవాళ సింగరేణిని కాంగ్రెస్, బీజేపీలు కలిసి దోచుకుంటున్నాయి. సింగరేణిలో దోపిడిని అడ్డుకోవడంలో మాతో కలిసొస్తే సీపీఐకి మద్దతిస్తామని కేటీఆర్ అన్నారు. ఇవాళ సింగరేణిలో దోపిడీ జరుగుతుంటే కేంద్రంలో ఉన్న బీజేపీ పట్టించుకోవట్లేదు. అంటే ఈ రెండు పార్టీలు కలిసే సింగరేణిని దోచుకుంటున్నాయి. సింగరేణిలో జరుగుతున్న స్కాంలు, దుర్మార్గాలకు అడ్డు కట్ట వేయాలంటే మేం సీపీఐతో కలిసొస్తామని కూనమనేనికి ఓపెన్ ఆఫర్ ఇచ్చామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

