– రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక
రుద్రంపూర్, ఫిబ్రవరి 13 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ నెల 12న నిర్వహించిన తెలంగాణ సీఎం కప్ సెకండ్ ఎడిషన్ ఛాంపియన్షిప్-2026 జిల్లాస్థాయి క్రీడా పోటీల్లో చుంచుపల్లి మండలం, ధన్బాద్ గ్రామ పంచాయతీ పరిధిలోని సెయింట్ జోసెఫ్ హై స్కూల్ విద్యార్థులు విశిష్ట ప్రతిభ కనబరిచారు. పలు విభాగాల్లో స్వర్ణ, రజత పతకాలు సాధించి జిల్లాకు కీర్తి తీసుకువచ్చారు.
మూడు స్వర్ణ పతకాలతో మెరిసిన విద్యార్థులు :
జి. అనిరుద్ (9వ తరగతి) – స్వర్ణం
సి.హెచ్. అక్షిత్ (8వ తరగతి) – స్వర్ణం
జె. మణిదీప్ (6వ తరగతి) – స్వర్ణం
వై. ధనుష్ (9వ తరగతి) – స్వర్ణం
సి.హెచ్.ఆశ్రిత్ (8వ తరగతి) – రజత
మొత్తంగా 4 స్వర్ణ పతకాలు, 1 రజత పతకం సాధించి సెయింట్ జోసెఫ్ విద్యార్థులు తమ ప్రతిభను చాటుకున్నారు.
ఇదిలా ఉండగా, ఈ నెల 20, 21 తేదీల్లో హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తరఫున ఈ విద్యార్థులు ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ బ్రదర్ రాజశేఖర్ రెడ్డి విద్యార్థులను అభినందిస్తూ రాబోయే రోజుల్లో జాతీయస్థాయి పోటీల్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. పతకాలు సాధించేలా విద్యార్థులను తీర్చిదిద్దిన ఉపాధ్యాయులను అభినందించారు.