Sunrise Charitable Trust | ఘట్ కేసర్, జూన్ 15: ఆర్థికంగా పేదవారై ఇబ్బందుల్లో ఉంటే తమ ట్రస్టు ఆదుకుని అండగా ఉంటుందని సన్ రైజ్ చారిటబుల్ ట్రస్టు అధ్యక్షుడు వై సుందర్ రావు, ప్రధాన కార్యదర్శి మోపర్తి శ్రీకాంత్ తెలిపారు.
ఘట్ కేసర్ మున్సిపాలిటీ ఎన్ ఎఫ్‌సీ నగర్‌లోని సన్ రైజ్ చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో నగరంలోని బాలాజీ నగర్ కు చెందిన మేదోజీ చంద్రమౌళి చారి కార్పెంటర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి షుగర్ వ్యాధి ఎక్కువ కావడంతో ఒక కాలు తీసివేసినందున ఏ పని చేసుకోలేని స్థితిలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు.
ఆర్ధికంగా పేదవాడు కావడంతో ట్రస్ట్‌ను ఆశ్రయించగా.. అతనికి రూ.20 వేల విలువ గల చెక్కును అందజేశారు. ఆపదలో ఉన్న పేద ప్రజలను తమ వంతు సహకారంగా నిరంతరం అండగా ఉండి ఆదుకునేందుకు తమ సంస్థ నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు శరభందా, బంగారు బాబు, దేవానంద్ గౌడ్, వీరారెడ్డి, కృష్ణ, రామయ్య, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
Sim Card | మీ పేరుతో ఎవరైనా సిమ్‌కార్డు తీసుకున్నారా..? ఎలా తెలుసుకోవాలంటే..?
RFCL | కోలుకుంటున్న ఆర్ఎఫ్సీఎల్ బాధితుడు.. అప్రమత్తతతోనే తప్పిన అగ్ని ప్రమాదం
Free medical camp | దయానంద విద్యా సమితి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం