Quality Education | పోచారం, జూన్ 11 : నాణ్యత, విలువలతో కూడిన విద్యను అందించి విద్యార్ధులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు వెళుతున్నట్లు స్కంద ఇంటర్నేషనల్ సీబీఎస్ పాఠశాల చైర్మన్ వెదిరె అశోక్ రెడ్డి అన్నారు.
పోచారం మున్సిపాలిటీ కాచివాని సింగారంలో అన్ని వసతులతో ఏర్పాటు చేసిన పాఠశాల భవనాన్ని బుధవారం పూజలు నిర్వహించి తోటి డైరెక్టర్లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వెదిరె అశోక్ రెడ్డి మాట్లాడుతూ..విద్యను వ్యాపార దృష్టితో చూడకుండా.. సేవాభావంతో ప్రతి ఒక్కరికి అందే విధంగా కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.
అన్ని వసతులతో నాణ్యమైన ఉపాధ్యాయుల బృందంతో కూడిన ఒక మంచి పాఠశాలను ఈ ప్రాంత ప్రజలకు అందిస్తున్నట్లు అశోక్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు లోకేష్‌రెడ్డి, బి చంద్రశేఖర్, రాజ్ కుమార్, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.
‘అశుద్ధ’ జలం..! గాగిళ్లాపూర్‌లో కలుషితమవుతున్న తాగునీరు
UPI Payments | రూ.3వేలు దాటిన యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు..?
BRK Bhavan | తెలుగు తల్లి ఫ్లై ఓవర్‌పై ఫొటో జర్నలిస్టులను అడ్డుకున్న పోలీసులు