MLC shambipur raju | దుండిగల్, జూలై 6 : కుత్బుల్లాపూర్ నియోజక వర్గం పరిధిలోని కాలనీలో ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు ఏర్పాటు చేయడమే లక్ష్యంగా సేవలు అందిస్తున్నామని ఉమ్మడి రంగారెడ్డి జిల్లాఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శంభీపూర్ రాజు అన్నారు.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ పరిధి, శంభీపూర్లోని ఆయన కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన పలువురు తాజా మాజీ ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువకులు, వివిధ కాలనీల సభ్యులు, వివిధ సంక్షేమ సంఘాల సభ్యులు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజును ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసారు.
ఈ సందర్భంగా తాము ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఎమ్మెల్సీకి తెలియజేయడంతోపాటు పరిష్కరించాలని విన్నవించారు. ఇందుకు ఎమ్మెల్సీ రాజు సానుకూలంగా స్పందించి ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నిత్యం అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా దుండిగల్ మున్సిపాలిటీ పరిధి, బహదూర్ పల్లి, గ్రీన్ హిల్స్ కాలనీ నూతన కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్సీ శంబిపూర్ రాజును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో సత్కరించారు. అనంతరం గ్రీన్ హిల్స్ కాలనీలో అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయించాలని వినతి పత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో దుండిగల్ మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ పద్మారావు, నాయకులు వెంకటేష్ గౌడ్, జహంగీర్ ,హాజీ ,షేక్ అమీన్, కాలనీ సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ కస్తూరి అమర్నాథ్, జనరల్ సెక్రటరీ దామోదర్, ట్రెజరర్ నర్రా రాజు, వైస్ ప్రెసిడెంట్ రఘుపతి రెడ్డి, జెనరల్ సెక్రటరీ రాజశేఖర్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు సుధాకర్, నరేష్, రాములు, నరసింహారెడ్డి, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
Sigachi Industries | సిగాచి ఇండస్ట్రీస్ పేలుడు ఘటనలో 41కి చేరిన మృతులు.. ఇంకా దొరకని 9 మంది ఆచూకీ
Dalai Lama | ఆధ్యాత్మిక గురువు దలైలామాకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు