KP Vivekananda | దుండిగల్, మే24: మౌలిక వసతుల కల్పనలో అధికారులు నిర్లక్ష్యం వహించవద్దని బీఆర్ఎస్ పార్టీ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద సూచించారు. నిజాంపేట కార్పొరేషన్ పరిధిలోని వివిధ డివిజన్లలో జరుగుతున్న అభివృద్ధి పనులపై కార్యాలయంలో శనివారం నాడు వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కేపీ వివేకానంద మాట్లాడుతూ.. నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు డివిజన్లలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఇప్పటికే పలుమార్లు ప్రత్యేకంగా క్షేత్రస్థాయిలో పర్యటించడం జరిగిందని అన్నారు. ఆయా కాలనీలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు ఇప్పటికే చేపట్టిన అభివృద్ధి పనులను పూర్తిచేయాలని సూచించారు. అదే సమయంలో ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనలో నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా సకాలంలో పనులను పూర్తి చేయాలన్నారు.