NVSS Prabhakar | చర్లపల్లి, మే 17 : చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారి అరుణ్‌కుమార్ జైన్‌ను కోరారు. ఈ మేరకు ఆయన ఎంఎంటీఎస్ రైళ్లను పెంచడంతోపాటు ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించాలని అరుణ్‌కుమార్ జైన్ దృష్టికి తీసుకువచ్చారు.
ఈ సందర్భంగా ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ.. మెట్రోరైలు చార్జీలు పెరిగిన నేపథ్యంలో నగరంలో పలు ప్రాంతాలను కలుపుతూ నడుస్తున్న రైళ్లను ప్రతీ ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎన్ఎఫ్సీ రైల్వే బ్రిడ్జ్‌ను విస్తరించడంతోపాటు మౌలాలి రైల్వే స్టేషన్‌ను ఆధునీకరించేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
అదేవిధంగా జీహెచ్ఎంసీ, ఆర్టీసీ, ఐడీఏ, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రైల్వే విభాగం అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Read Also :
Inmates Escaped: అమెరికా జైలు నుంచి 10 మంది ఖైదీలు పరారీ
Karimnagar Simha Garjana | కరీంనగర్ సింహ గర్జన.. ఉద్యమ రథసారథి కేసీఆర్ ప్రసంగం ఇదీ..
Tortoise | ఏకంగా వెయ్యి కిలోమీటర్లు ఈది.. ఒడిశా నుంచి ఆంధ్రప్రదేశ్‌కు తాబేలు